
రైల్లో ప్రయాణికుడికి అస్వస్థత
ఆమదాలవలస : రైల్వే ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో 108లో హుటాహుటిన చికిత్స అందించారు. శనివారం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుణుపూర్ పాసింజిర్‌లో పర్లాకిమిడి సమీపంలోని కాజీపేటకు చెందిన ఎం.దిలీప్‌కుమార్ ప్రయాణిస్తున్నాడు. ఉర్లాం సమీపంలోకి వచ్చేసరికి ఛాతిలో నొప్పి వస్తుందని తోటి ప్రయాణిలకు చెప్పాడు. దీంతో వారు 108కు ఫోన్‌చేసి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌కు రావాలని తెలియజేశారు. రైలు చేరుకునే సమయానికి 108 సిబ్బంది మూడో నంబ ర్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకొని బాధితునికి ప్రథమచికిత్స అందించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదే అంబులెన్సులో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు.