
‘ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలు’
పర్లాకిమిడి: ఆడపిల్ల సంతానం వల్ల కుటుంబానికి సమాజానికి నష్టం ఏమీ లేదని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తోందని సబ్‌కలెక్టర్ అనుప్ పండా అన్నారు. గజపతి జిల్లా స్థాయిలో అంతర్జాతీయ కన్యాసంతానం దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో సబ్‌కలెక్టర్ పండా ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలిక రేపటి రోజు మాతృమూర్తిగా, ఒక జడ్జి, సాఫ్ట్‌వేర్, కలెక్టర్, ఎస్పీగా అనేక బాధ్యతలు నిర్వహిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఓస్వాన్ భవనంలో సమావేశంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. వారిలో ముఖ్యంగా జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జువెనెల్ కోర్డు ప్యానల్ లాయర్ భాగ్యలక్ష్మీ నాయక్, అదనపు డీహెచ్‌ఓ డాక్టర్ రబినారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి సి.డి.పి.ఓ. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ప్రొగ్రాం అధికారి సరలా పాత్రో, సునితా రోథో ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు.

‘ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలు’

‘ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలు’