
మానసిక ఆరోగ్యంపై అవగాహన
జయపురం: జయపురం సమితి అంబాగుడ గ్రామ పంచాయతీ రొండాపల్లిలో కొరాపుట్ న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో మానసిక వైద్య శిబివార్ని శుక్రవారం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి సూచన మేరకు రొండాపల్లిలోని జయపురం కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సివిల్ కోర్టు రిజిస్ట్రాస్టార్, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ఇన్‌చార్జి కార్యదర్శి బిష్ణు ప్రసాద్ దేవత ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ పదో తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతులను చేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు అన్నారు. న్యాయాధికారులు హరమాన్ దాస్, భీష్మ రౌత్ రాయ్, జయపురం కాలేజీ ఆఫ్ ఫార్మసీ రొండాపల్లి డైరెక్టర్ ప్రియంబద సారంగి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యబ్రత జెన, జిల్లా వైద్యాధికారి డాక్టర్ దిలీప్‌కుమార్ జెన, జయపురం వైద్యాఽధికారి డాక్టర్ సవ్యసాచి మహాపాత్రో, శిశుకళ్యాణ కమిటీ సభ్యురాలు భానుమతి పూజా తదితరులు ప్రసంగిస్తూ మానసిక ఆరోగ్యంపై అందరూ దృష్టిసారించాలన్నారు. మానసిక వ్యాధుల నియంత్రణ, మానసిక రోగుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

మానసిక ఆరోగ్యంపై అవగాహన