
15 ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం
భువనేశ్వర్: లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగిన 28వ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో 10 విభాగాలు ప్రతిపాదించిన 15 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ వివరాలను ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా మీడియాకు వివరించారు. రాష్ట్ర మంత్రి వర్గం రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర నదుల అనుసంధాన పథకం ప్రతిపాదనను ఆమోదించింది. దీని కోసం పంచ వర్ష వ్యయ ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం వ్యయ ప్రణాళిక రూ.1790.00 కోట్లు. ఈ నిధులను 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029–30 వరకు క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా వెచ్చించాలని మంత్రి మండలి నిర్ణయించింది. నీటి మిగులు నదీ పరీవాహక ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా అంతర్ రాష్ట్ర నీటి పంపిణీని బలపరచడం ఈ పథకం లక్ష్యం. దీని వల్ల కరువు స్థితిస్థాపకతను మెరుగుపరచడం, అదనపు నీటి నిల్వను సృష్టించడం, వరద ప్రమాదాలను తగ్గించడం, ఆరు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం సుసాధ్యం అవుతాయని మంత్రి వర్గం అభిప్రాయపడింది.
అంతర్ రాష్ట్ర నదీ అనుసంధానం పథకాలు
● కాట్రా లింక్ ప్రాజెక్ట్ (కంసపాల్ ఐఎస్‌ఎస్
నుండి ఫీడర్ ఛానల్)
● వంశధార – రుషికుల్య (నందిని నల్లా) ఇంట్రా ● లింక్ ప్రాజెక్ట్
● హిరాధర్బాతి వరద ప్రవాహ కాలువ ప్రాజెక్ట్
● బహుదా – తంపరా లింక్ ప్రాజెక్ట్
● ఓంగ్ – సుక్ తేల్ గార్లాండ్ కాలువ ప్రాజెక్ట్
● తెలంగిరి – ఎగువ కోలాబ్ పీఎస్‌పీ ప్రాజెక్ట్