
8 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్‌గిరి:
మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఇరిగేషన్ కాలనీలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో తులారామ్ హరిజన్ ఇంటి పెరట్లోకి ఎనిమిది అడుగుల కొండచిలువ చొరబడింది. దీన్ని చూసిన కుటుంబ సభ్యులు స్నేక్‌హైల్ప్‌లైన్ సభ్యుడు రాకేష్ హాల్ధార్ సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పామును అతికష్టంపై పట్టుకున్నారు. సమీపంలోని కొండల్లో నుంచి వచ్చిన కొండచిలువ కోళ్లను తినేసి ఉందని స్నేక్‌క్యాచర్ చెప్పారు. మంగళవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సూచనలతో తిరిగి అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టారు.