
బాహినీ ఆయుధ పూజ ప్రారంభం
● దేవీ మండపాలకు పెరిగిన భక్తుల తాకిడి
పర్లాకిమిడి: స్థానిక బెబర్తా వీధిలోని శ్రీకృష్ణచంద్ర గజపతి సమరయోధుల వాహినీ దుర్గాష్టమి సందర్భంగా ఆయుధపూజను మంగళవారం ప్రారంభించారు. అప్పటి పర్లాకిమిడి మహారాజు గౌరచంద్ర గజపతి నారాయణ దేవ్ కాలం నాటి కత్తులు, డాలు, సమరయోధులు కర్ర తిప్పడం వంటి నైపుణ్య విన్యాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆష్టమి నుంచి ఈ ఆయుధాలను బయటకు తీసి పూజను ప్రారంభించి విజయదశమి రోజున బెబర్తావీధి, కటిక వీధి, చిత్రకార వీధిలో వున్న సమరయోధులు పర్లాకిమిడి పురవీధులు, మహారాజా ప్యాలస్ వద్ద విన్యాసాలు చేస్తారు. అప్పట్లో మహారాజులు ఈ విన్యాసాలు చూసి వారికి నగదు బహుమతులు అందించేవారు. కాలానుకూలంగా రాజులకాలం పోయి సమరయోధులు యుధ్ధవిన్యాసాలు గజపతి జిల్లాలో ప్రదర్శిస్తుంటారు. కాగా మంగళవారం అన్ని దేవీ పెండాళ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పోలీసులను ప్రతి జంక్షన్ వద్ద మోహరించి ట్రాఫిక్ సమస్యలేకుండా చేశారు. కటిక వీధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నఅష్టమి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

బాహినీ ఆయుధ పూజ ప్రారంభం