
ప్రత్యేక పూజలు..
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో ఏకై క శక్తి పీఠం మా బండారు ఘరణి దేవాలయంలో తెలుగు మహిళలు పారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జ్యోతిర్మయి ఆధ్యాత్మిక సంస్థ మహిళల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో మా బండారు, మా పెండ్రాణి అమ్మవారి దేవాలయాల మధ్య పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సుమారు వంద మంది మహిళలు కాషాయ చీరలు ధరించి మంత్రాలు పఠించారు. ఇదే సమయంలో దేవాలయానికి వచ్చిన బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి మహిళలను అభినందించారు. సుమారు 15 ఏళ్లుగా జ్యోతిర్మయి మహిళలు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పారాయణం చేస్తున్నారు. మరోవైపు పపడాహండి సమితి కేంద్రంలో దసరా సందర్భంగా ఏర్పటు చేసిన పెండళ్లు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ప్రత్యేక పూజలు..