
ఘనంగా దసరా ఉత్సవాలు
● రాజ భవనాలు తిలకించేందుకు పోటెత్తిన జనం
జయపురం: దసరా ఉత్సవాల సందర్భంగా అందంగా అలంకరించిన జయపురం మహారాజ భవనాలను తిలకించేందుకు జనం పోటెత్తాన్నారు. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు రాజ భవనాలను సందర్శించారు. కోటలో పల మరఫిరంగులను తిలకించారు. రాజాల యుద్ధ సమయంలో శత్రువులను వధించడానికి వినియోగించే ఫిరంగులకు గుడి కట్టి పూజలు జరుపుతున్నారు. ఆ ఫిరంగులు తిలకించి ప్రజలు పూజిస్తున్నారు. సోమవారం సాయంత్రం తరువాత జయపురం రాజ కుమారుడు బిశ్వంబర చంద్ర చూడదేవ్ దసరా ఉత్సవాల్లో భాగంగా రాజులు ధరించే దుస్తులతో ప్రజలకు దర్శనం ఇచ్చారు. అతనికి ప్రత్యేక ఛత్రం(గొడుగు) పట్టి యువత ఆయనతోపాటు నడిచారు. యువ రాజుని చూసేందుకు ప్రజల పోటెత్తగా.. యువకులు అతని చుట్టూ రక్షణ వలయంగా నిలిచి ముందుకు తీసుకువెళ్లారు.

ఘనంగా దసరా ఉత్సవాలు