
బాల్య వివాహాలు నిర్వహించం
కొరాపుట్: ఇకపై తాము బాల్య వివాహాలను ప్రోత్సహించమని వివిధ దేవాలయాల అర్చకులు పేర్కొన్నారు. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల వద్ద స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. దేవాలయాల్లో బాల్య వివాహాలను అనుమతిమంచమని, అలాగే బాల్య వివాహాలను ప్రోత్సహింహించమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎవరైనా తమను సంప్రదిస్తే అధికారులకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. పట్టణంలోని బండారు ఘరణి, జగన్నాథ, పాత శివాలయం, హనుమాన్, సత్యానారాయణ స్వామి దేవాలయాల వద్ద ప్రతిజ్ఞలు చేశారు. కార్యక్రమంలో శోభ సంస్థకి చెందిన ఉమా సత్నమి,తపస్ రంజన్ డంగ్రి, భువనేశ్వర్ దిశారి తదితరులు పాల్గొన్నారు.