
ప్రాథమికస్థాయి నుంచే హిందీబోదన జరగాలి..
ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ నుంచే హిందీ బోధన సాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో అలా జరగడంలేదు. కనీసం 2, 3వ తరగతుల నుంచైనా హిందీ బోధన మొదలుకావాలి. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, హిందీ భాషాపండితులను నియమించాలి. డీఎస్సీ ద్వారా హిందీ పండిట్‌పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేయాలి. – కోనే శ్రీధర్, ఉత్తరాంద్ర
సమన్వయకర్త, హిందీ మంచ్
హిందీ భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాలి. జాతీయ భాషగా హిందీకి తగిన గుర్తింపు ఇప్పటికీ లభించలేదనే చెప్పాలి. హిందీ భాషాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు పండిట్ ట్రైనింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. – కనుగుల సత్యం,
జిల్లా అధ్యక్షుడు, హిందీ మంచ్
హిందీ మన దేశ జాతీయ భాష. జాతీయ సమైక్యతను ఇనుమడింపజేసే భాష హిందీయే. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో హిందీకి 17 సెక్షన్ల తర్వాతే రెండో పోస్టును భర్తీ చేస్తుండటం తగదు. ఇది తీరని అన్యాయం. హిందీ లెక్చరర్లను నియమించాలి. పదోన్నతులతో భర్తీచేయాలి.
– ఇమ్మిడిశెట్టి సంతోష్‌కుమార్,
హిందీ ఫోరం జిల్లా కన్వీనర్
●

ప్రాథమికస్థాయి నుంచే హిందీబోదన జరగాలి..

ప్రాథమికస్థాయి నుంచే హిందీబోదన జరగాలి..