
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
కేంద్ర మంత్రికి నవీన్ లేఖ ఎరువుల నిల్వలు పుష్కలం: వ్యవసాయ
భువనేశ్వర్: సాగుకాలంలో ఎరువుల కొరత రాష్ట్ర రైతులను వేధిస్తుంది. పలు చోట్ల ఎరువుల కోసం రైతులు వీధికి ఎక్కి నిరసన ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా దళిత ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఎరువుల కొరత తీవ్రత మరింత అధికంగా కొనసాగుతోంది. నయాగడ్ జిల్లా గొడిపొదా గ్రామంలో రైతాంగం యూరియా తదితర ఎరువుల కోసం వీధికి ఎక్కి నడి రోడ్డు మీద బైఠాయించారు. వాహనాల రవాణా స్తంభింపజేయడం జన జీవనం పాక్షికంగా ప్రభావితమైంది. కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు ఈ ఆందోళన చేపట్టారు.
విపక్షం ప్రతిస్పందన
ఎరువుల కోసం రైతుల ఇక్కట్ల పట్ల రాష్ట్రంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సమయానుకూలంగా ప్రతిస్పందించింది. రాష్ట్ర రైతాంగానికి ఎరువుల కొరత నివారించే దిశలో సత్వర చర్యలు చేపట్టాలని విపక్ష నేత, బిజూ జనతా దళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తొలగించే దిశలో క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎరువుల సరఫరాలో విస్తృతమైన అవకతవకలు, బ్లాక్ మార్కెట్, కల్తీ, మార్కెట్‌లో యూరియా కృత్రిమ కొరత వేధింపులకు సంబంధించి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రికి రాసిన లేఖలో సమగ్ర పరిస్థితిని వివరించినట్లు బిజూ జనతా దళ్ ప్రకటించింది. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులు తక్షణమే సరఫరాను చేయాలని నవీన్ పట్నాయక్ ఒత్తిడి చేశారు.
రాష్ట్రంలో ఎరువుల నిల్వలు పుష్కలం
రాష్ట్రంలో సాగు పనులకు అవసరమైన ఎరువుల నిల్వ పుష్కలంగా కొనసాగుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయం, రైతు సాధికారిత విభాగం మంత్రి కనక వర్ధన్ సింగ్‌దేవ్ ఎరువుల సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో తగినంత ఎరువుల నిల్వ ఉందని వివరించారు. ఈ సీజనులో రైతులకు వివిధ రకాల ఎరువుల 8.46 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, నకిలీ ఎరువుల అమ్మకాలను అరికట్టడానికి క్షేత్ర స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తరచూ దాడులు నిర్వహిస్తున్నాయి. అక్రమార్కుల వ్యతిరేకంగా ఆ బృందాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవకతవకలకు పాల్పడిన 1,202 మంది రిటైల్ డీలర్లకు వివరణ కోరుతు ఉత్తర్వులు జారీ చేశారు. 30 దుకాణాలలో అమ్మకాలు నిలిపివేతకు ఆదేశించారు. 62 మంది డీలర్ల లైసెన్స్‌లను సస్పెన్షన్, రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదు. పుష్కలంగా నిల్వ కొనసాగుతుంది. ఈ సీజన్ కోసం 11.04 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల నిల్వ అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. దీనిలో ఇప్పటి వరకు 8.46 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు విక్రయించారు. గత ఖరీఫ్ సీజనులో ఈ వ్యవధిలో 7.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే రైతాంగానికి చేరినట్లు ప్రకటనలో పేర్కొంది. రానున్న 2 రోజుల్లో 11,692 మెట్రిక్ టన్నుల యూరియా పీఏసీ, ల్యాంప్‌ల ఆధ్వర్యంలో రైతాంగానికి చేరుతుందని వ్యవసాయ శాఖ రాష్ట్రంలో రైతులకు హామీ ఇచ్చింది. భారత ప్రభుత్వం, ఎరువుల కంపెనీల సమన్వయంతో రాష్ట్ర రైతాంగానికి సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందజేసేందుకు రాష్ట్ర శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
మంత్రి