
‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’
కొరాపుట్: గనుల తవ్వకాలను అడ్డగిస్తామని అఖిల పక్షం హెచ్చరించింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్నత స్థాయి అధికారులను కలసి లేఖలు అందజేసింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కొడింగా మాలిలో బాకై ్సట్ గనుల తవ్వకాలు అడ్డుకుంటామని ముందస్తు ప్రకటన చేసింది. గతంలో ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలు ముందు వేదాంత సంస్థ అనేక హామీలు ప్రజల ముందు ఉంచిన విషయం గుర్తు చేసింది. ఈ ప్రాంతంలో 3 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల తవ్వకాలకు అనుమతి ఉండేదని, అది ప్రస్తుతం 6 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల బాకై ్సట్ తవ్వకాలకు అనుమతి సాధించిందన్నారు. ఇదే ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి పరిశ్రమని వేరే చోట ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాక నిత్యం ఇక్కడ నుంచి గనులు తవ్వుకొని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు. ఇక్కడ వారికి ఉపాధి కూడా ఇవ్వకపోగా ప్రభుత్వ నిభందనల ప్రకారం ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన ఫెరి ఫెరి డెవలప్‌మెంట్ నిధులు ఈ ప్రాంతంలో వినియోగించడం లేదన్నారు. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి ఈ ప్రాంతం లో నిరవధిక బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు తగ్గ లేఖలను సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్, ఎస్పీ రోహిత్ వర్మకి లేఖలు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, బీజేడీకి చెందిన మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే పవిత్ర శాంత తదితరులు పాల్గొన్నారు.

‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’

‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’

‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’