
చంపాకు కలెక్టర్ అభినందనలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి అంబలిబేఢ గ్రామానికి గురువారం కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ స్వయంగా వెళ్లి ఆదిమ తెగకు దిదాయి తెగకు చెందిన చంపా రస్‌పెడ అనే యువతిని అభినందించారు. ఆమె నీట్ పరీక్షల్లో స్థానం సాధించిన విషయంం విధితమే. ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.30 వేలు నగదు చెక్‌ను అందజేశారు. అలాగే ఓ మొబైల్ ఫోన్, దుస్తులు కూడా ఇచ్చారు. ఆమె తండ్రి సదరణ కాజు రైతుగా పని చేస్తూ ఎంతో కష్టపడి పిల్లలను చదివించారు. ఆమె నీట్‌కు ఎలా ప్రిపేర్ అయ్యిందో కలెక్టర్ తెలుసుకున్నారు. చదువు పూర్తయ్యాక తన గ్రామానికి వైద్య సేవలు అందిస్తానని ఆమె తెలిపారు.

చంపాకు కలెక్టర్ అభినందనలు