
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పర్యావరణం, అటవీ సంరక్షణ, వాతావరణ స్థితిస్థాపకత, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలతో ఒడిశాకు సంబంధించిన అనేక అంశాలపై వారు చర్చించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
సోషల్ మీడియాలో
శ్రీమందిరం ఫొటోలు
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని ఆలయం లోపలి ప్రాకారం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం దుమారం రేగుతోంది. దీంతో మరోసారి శ్రీమందిరం రక్షణ, భద్రత వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. శ్రీమందిరం లోపలి ప్రాకారంలో తీసుకున్న ఫొటోని పర్యాటకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. పర్యాటకుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
వంతెన నిర్మించాలని వినతి
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ మారుమూల ప్రాంతం ఖర్చబడి గ్రామ పంచాయతీలో 15 గ్రామాలకు హారభంగి నదిపై వంతెన లేకపోవడం వలన వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆయా గ్రామస్తులు కలెక్టరేట్‌లో గురువారం వినతిపత్రం అందజేశారు. హారభంగి నదికి ఆనుకుని ఉన్న రజామా, ఖరికువా, హలాబడి, గలమా, కుటిగుడ, రటమా, రాకేష్ పంకా, ఖోజురిపద, కోంద అడవా, గోపిమా, పరమంగాల గ్రామాలకు వంతెన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అందువలన వెంటనే హారభంగి నదిపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు వినతుల అందజేశామని గుర్తు చేశారు. కలెక్టర్‌ను కలిసినవారిలో ఖర్చబడి పంచాయతీ సమితి సభ్యులు టునా మల్లిక్, సర్పంచ్ రాజా మల్లిక్, రవీంద్ర మల్లిక్ తదితరులు ఉన్నారు.
పాముకాటుతో బాలుడు మృతి
రాయగడ: పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి నారాయణపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి దేవేంద్ర కౌసల్యకు చెందిన 12 ఏళ్ల కుమారుడు దశమంత్ కౌసల్యగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషపూరితమైన పాము దశమంత్‌ను కాటు వేసింది. దీంతో కేకలు పెట్టిన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆత్మాహుతి చేసుకున్న మహిళ మృతి
భువనేశ్వర్: కటక్ జిల్లా సలేపూర్ ప్రాంతంలో ఆత్మాహుతికి పాల్పడిన మహిళ మృతి చెందారు. సలేపూర్ ప్రాంతం కాంక్రెయిలో గ్రామంలో కుటుంబ కలహాలతో మహిళ మంగళవారం ఆత్మాహుతికి పాల్పడింది. చికిత్స కోసం కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం తుది శ్వాస విడిచింది.

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ముఖ్యమంత్రి భేటీ

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ముఖ్యమంత్రి భేటీ

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ముఖ్యమంత్రి భేటీ