
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ఆటో
బొండపల్లి: మండలంలోని చందక పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం వేకువ జామున జరి గిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. విజయనగరం నుంచి గజపతినగరం వైపు మిరపకాయలు లోడుతో వెళ్తున్న ఆటో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టడంతో శ్రీకాకుళానికి చెందిన డ్రైవర్ చంద్రరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.