
ఐరాస రికార్డుల్లో చోటు
ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో స్థానిక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) స్థానం చేజిక్కించుకుంది. గిరిజన యువతకు సాధికారత కల్పించడంలో తిరుగులేని సంస్థగా ప్రాధాన్యత సంతరించుకుని ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుని సాధించడం విశేషం. పరివర్తనాత్మక, ప్రయోజనకర విద్యా బోధనతో గిరిజన మరియు ఇతర వెనుకబడిన యువతకు సాధికారత కల్పించడంలో కిస్ నిరంతర కృషిని ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ఈసీఓఎస్‌ఓసీ) గుర్తించింది. గిరిజన సమూహాల నుంచి బాలలను అక్కున చేర్చుకుని కిస్ సంస్థ బాహ్య ప్రపంచంలో హుందాగా ఉనికిని ప్రదర్శించే రీతిలో తీర్చిదిద్దుతోంది. – భువనేశ్వర్