
125 మందికి కంటి వైద్య పరీక్షలు
జయపురం: స్థానిక కాళీకృష్ణ సంఘ ప్రతిష్ట దినోత్సవం, సద్గురు దేవ్ స్వామీ సశ్చిదానంద సరస్వతీ మహారాజ్ 83వ జన్మదినం పురస్కరించుకొని స్థానిక కాళీకృష్ణ మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 125 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో కాళళీకృష్ణ సంఘ అర్జున పట్నాయిక్ గిరిజానంద, ముకుంద నంద, మృత్యంజయ ఠాకూర్, అమిత మిశ్ర, దివాకర దొలాయ్, అరుణ షొడంగి, జన్మేజయ దాస్, సంతోష్ కౌర్, కాళీకృష్ణ, అనిల్ పండ తదితరులు పాల్గొన్నారు.