
భారీగా గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు శారదాపూర్ అడవుల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా శారదాపూర్ అడవుల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 199 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన రవాణాదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
చంద్రపూర్‌లో...
గంజాయి సాగుకు నిలయంగా గుర్తింపు పొందిన చంద్రపూర్‌లో పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిరమా కూడలిలో ఒక వ్యక్తి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈ మేరకు కోర్టుకు తరలించారు.

భారీగా గంజాయి స్వాధీనం