
మహిళలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతిపక్ష బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రహ్మపురలో సోమవారం ఆందోళన చేపట్టారు. నబరంగ్‌పూర్, కొరాపుట్ జిల్లాలకు చెందిన బీజేడీ నాయకులు భారీగా పాల్గొన్నారు. బ్రహ్మపుర పట్టణంలో దక్షిణ ఒడిశా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని పార్టీ శ్రేణులు ముట్టడించారు. దక్షిణ ఒడిశాలోని పది జిల్లాల నుంచి కార్యకర్తలు ఆందోళనలో పాలొగన్నారు. బాలేశ్వర్ జిల్లాలో విద్యార్థిని సౌమ్యశ్రీ హత్యతోపాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరిగింది. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎంపీ ప్రతిప్ మజ్జి, జెడ్పీ ప్రెసిడెంట్ మెతిరాం నాయక్ హాజరవ్వగా.. కొరాపుట్ జిల్లా నుంచి మాజీ మంత్రి రబి నారాయణ నందో, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ మంత్రి పద్మిని దియాన్, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం పొడాల్, ప్రభు శాంత, ప్రపుల్ల పంగి, పీతం పాడీ, బీజేడీ నాయకులు నాగరాజు దొర, లతా రాయ్, దుర్గా మిశ్రా, బాల్ రాయ్, శివ పట్నాయక్, బాలంకేశ్వర రావు, ప్రసాద్ బిడ్డిక పాల్గొన్నారు.
బ్రహ్మపురలో ఆందోళన
భారీగా హాజరైన బీజేడీ పార్టీ నాయకులు

మహిళలపై దాడులు అరికట్టాలి

మహిళలపై దాడులు అరికట్టాలి