
కనేవారిని అరెస్టు చేయాలి
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
నలుగురు బిడ్డలను
జయపురం: దేశంలో ప్రజలందరికీ చట్టం సమానమని, చట్టానికి జాతి, కుల, మత, ధర్మ భేదాలు లేవని రాష్ట్రీయ హిందు ఫ్రంట్ ఒడిశా, కొరాపుట్ జిల్లా శాఖ ప్రతినిధులు అన్నారు. అందుచేత అన్నివర్గాల కుటుంబాలకు ఇద్దరు బిడ్డల చట్టాన్ని తు.చ తప్పకుండా అమలు చేయాలని రాష్ట్రీయ హిందు ఫ్రంట్ డిమాండ్ చేసింది. రాష్ట్రీయ హిహిందు ఫ్రంట్ నేతలు జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్య రెడ్డిని శనివారం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహణ మఝి నుద్దేశించిన వినతి పత్రాన్ని అందజేశారు. చైనా వైశాల్యం 95.96 వేల చదరపు కిలోమీటర్లని భారత దేశం 32.87 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యమని వినతి పత్రంలో వెల్లడిస్తూ , చైనాతో పోల్చుకుంటే భారత్ వైశాల్యంలో చిన్నది అయినా జనాభాలో అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రతి రోజూ మన దేశంలో 65,797 మంది పిల్లలు జన్మిస్తున్నారని వెల్లడించారు.అంటే ప్రతి యేడాది 25 కోట్ల మంది కి పైగా జనసంఖ్య పెరుగుతున్నదని వివరించారు.జనాబాను నియంత్రంచక పోతే 2050 నాటికి దేశ జనాబా 240 కోట్లను దాటుతుందని రాష్ట్రీయ హిందూ ఫ్రంట్ ప్రతినిధులు వినతి పత్రంలో వెల్లడించారు. ఆ సమయానికి దేశంలో కేవలం 80 కోట్ల మంది హిందువులు మాత్రం ఉంటారని వివరించారు. అందుచేత దేశంలో అన్నివర్గాల వారికి కుటుంబ నియంత్రణపై కఠిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కొన్నివర్గాల వారు అధిక సంతానం కంటున్నారని, అటువంటి వారిని కఠినంగా దండించాలి అని డిమాండ్ చేశారు. ఎవరైనా మూడవ సంతానం కంటే వెంటనే అలాంటివారిని ప్రభుత్వ ఉద్యాగాల నుంచి తొలగించాలని, ఓటరు గుర్తింపు కార్డు రద్దు చేయాలని, ఎన్నికలలో పోటీ చేసే హక్కును రద్దు చేసే చట్టాన్ని తీసుకు రావాలని అలాగనే నలుగురిని కన్న వారికి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రాన్ని రాష్ట్రీయ హిందూ ఫ్రంట్ కొరాపుట్ జిల్లా అద్యక్షులు రవీంద్ర పాఢీ, ఉపాధ్యక్షులు మీనకేతన పొరిచ, సీనియర్ న్యాయవాది మదన మోహణ నాయిక్, న్యాయవాదులు జ్యోతీ ప్రకాశ పూజారి, గిరిదర ఖొర,గుప్తేశ్వర బ్రహ్మ,మనమోహణ మిశ్ర,వల్లభ నారాయణ షొడంగి,సాహెబ్ మహరాణ,వరుణ జైన్,విజయ కుమార్ సాహు తదితరులు సబ్‌లక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
న్యూస్‌రీల్

కనేవారిని అరెస్టు చేయాలి