నాగుపాముని మింగిన మందుబాబు | - | Sakshi
Sakshi News home page

నాగుపాముని మింగిన మందుబాబు

Jul 20 2025 5:43 AM | Updated on Jul 20 2025 5:43 AM

నాగుప

నాగుపాముని మింగిన మందుబాబు

భువనేశ్వర్‌: బొలంగీర్‌ జిల్లా తెంతులిఖుంటి గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి బతికి ఉన్న నాగు పాముని కరకర నమిలి మింగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని గుర్తించారు. సత్వర చికిత్స కోసం మందు బాబుని భీమా భొయ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందజేస్తున్న వైద్య వర్గాల సమాచారం. సజీవంగా ఉన్న పాముని ప్రత్యక్షంగా ముక్కలు ముక్కలు చేసుకుని మింగడంతో శరీరంలో విషం చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ సమితి ఖురిగా గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఇద్దరు గాయపడ్డారు. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో బొడొమర్రిబోట్ట గ్రామానికి చెందిన రంజిత్‌ కుమార్‌ నాయక్‌, బొర్జాఖాల్‌ గ్రామానికి చెందిన మహేంద్ర మాఝిలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కాసీపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు.

విదేశీ మద్యం పట్టివేత

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీ సంగేల్‌ గ్రామంలో భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విధుల్లో భాగంగాశుక్రవారం రాత్రి కలిమెల ఐఐసీ ముకుందో మేల్క తన సిబ్బందితో ఉండ్రుకొండ పంచాయతీ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న బొలేరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 28 కేసుల్లో ఉన్న మద్యాన్ని గుర్తించారు. దీన్ని శనివారం ఉదయం తెరిచి చూడగా 235 లీటర్ల మద్యం (800)మిల్లీలీటర్ల బాటిళ్లను ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులు ఝార్కాండ్‌కు చెందిన అరవింద కుమార్‌, కందన్‌ కుమార్‌, అభిషేక్‌ కుమార్‌, బీహార్‌కు చెందిన నీరజ్‌ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఐఐసీ తెలిపారు. నిందితులంతా కలిమెలలోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్నారు.

ప్రపంచ శ్రేణి సౌకర్యాలతో రైల్వే స్టేషన్లు: రైల్వే శాఖ సహాయ మంత్రి

భువనేశ్వర్‌: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌న్లను ప్రపంచ శ్రేణి సౌకర్యాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 59 రైల్వే స్టేషన్లను రూ. 2,379 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మంజూరు చేసిన వివిధ పనుల కింద రూ. 80,000 కోట్లకు పైబడిన వ్యయ ప్రణాళిక రైల్వే ప్రాజెక్టుల కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. గత ఏడాదిలో రాష్ట్రంలో 8 కొత్త రైల్వే ప్రాజెక్టులు, మల్టీట్రాకింగ్‌, ఫ్లైఓవర్‌ పనులకు రూ. 25,000 కోట్లు పైబడి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనుల్ని పురోగతిని సమీక్షించిన మంత్రి పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

నాగుపాముని మింగిన  మందుబాబు 1
1/2

నాగుపాముని మింగిన మందుబాబు

నాగుపాముని మింగిన  మందుబాబు 2
2/2

నాగుపాముని మింగిన మందుబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement