
● ఎమ్మెల్యే ఔదార్యం
కొరాపుట్: ప్రమాదంలో ఉన్న వ్యక్తి గురించి ఎమ్మెల్యే సోషల్ మీడియాలో చూసి సంఘటనా స్థలానికి వెళ్లి రక్షించిన విషయం వెలుగులోనికి వచ్చింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 326పై బండికార్ ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెటార్ సైకలిస్ట్ తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తున్న లక్ష్మీపూర్ సమితి కార్యాలయ ఉద్యోగి ఆశిష్ గర్దా ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి సహాయం కోరాడు. ఈ దృశ్యాన్ని సమీపం గ్రామంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత చూశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని తన వాహనంలోనే లక్ష్మీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లి చేర్పించారు. క్షతగాత్రుడు అక్షయ్ హిక్కా తోయాపుట్ గ్రామ పంచాయితీ ఉస్కాబెటా గ్రామవాసిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులను రప్పించారు. వారు వచ్చిన వెంటనే నగదు సహాయం అందించి అంబులైన్స్ ద్వారా కొరాపుట్‌లోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు.
క్షతగాత్రుడిని రక్షించిన వైనం

● ఎమ్మెల్యే ఔదార్యం