
వివాహిత అనుమానాస్పద మృతి
జయపురం: వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి ముర్తాహండి గ్రామ పంచాయతీ మాలచమాల్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు మాలచమాల గ్రామం లచమన జాని భార్య సొమల జానిగా గుర్తించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఆమె భర్త లచమన జాని (30)ని కొట్‌పాడ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచమన్ తన భార్య సోమల జానితో గత ఆదివారం దిచక్ర వాహనంపై పంట పొలం చూసేందుకు వెళ్లారు. సొమల జాని బైక్ వద్ద నిలబడి ఉంది. అయితే లచమన తిరిగి వచ్చే సరికి ఆమె కనిపించలేదు. దీంతో భర్త భార్య ఆచూకీ కోసం స్థానికంగా గాలించాడు. అనంతరం తన మామయ్యకు కబురు చేశాడు. అనంతరం సొమల జాని కనిపించడం లేదని కొట్‌పాడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను హత్య చేశారన్న అనుమానం వ్యక్తం చేస్తూ సొయల జాని తండ్రి సనసాయి దురువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను కొంతకాలంగా అల్లుడు లచమన వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సనసాయి దురువతోపాటు కొంతమంది గ్రామస్తులు పుట్టగొడుగుల కోసం గ్రామానికి సమీపంలోని ఆడవిలోకి వెళ్లగా వారికి కుళ్లిన వాసన రావడంతో అటుగా వెళ్లి చూడగా ఒకచోట మట్టిలో మహిళ మృతదేహం కప్పి ఉండటం కనిపించింది. వెంటనే వారు కొట్‌పాడ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ టీమ్‌ను రప్పించారు. బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక, కొట్‌పాడ్ పోలీసు అధికారి పరమానంద సునాని తదితరుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. లచమన జాని తన భార్యను హత్య చేశాడన్న అనుమానంతో అన్ని అరెస్టు చేశారు.
అటవీ ప్రాంతంలో శవమై తేలిన వైనం
హత్యేనని కన్నవారి ఆరోపణ
భర్తను అరెస్టు చేసిన పోలీసులు