
గ్రీవెన్స్‌సెల్‌కు 63 వినతులు
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రామ ముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్‌కు జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్‌తోపాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహాణాధికారి శంకర కెరకటా పాల్గొన్నారు. కత్తల కవిటి, రాణిపేట, సిద్ధమణుగు పంచాయితీ, పర్లాకిమిడి పురపాలక సంఘం నుంచి 63 వినతులు అందాయి. వాటిలో 49 వ్యక్తిగతం కాగా.. గ్రామ సమస్యలకు సంబంధించినవి 14 ఉన్నాయి. వాటిలో మూడు వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ పీవో అంశుమాన్ మహాపాత్రో, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, గుసాని బీడీవో గౌరచంద్ర పట్నాయక్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో కలెక్టర్లు సోమవారం గ్రీవెన్ సెల్ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ నందపూర్ సమితి కేంద్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భారీ వర్షంలో కూడా మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 60 ఫిర్యాదుల చేశారు. ఇందులో 19 వ్యక్తిగత ఫిర్యాదులు, 41 సామాజిక ఫిర్యాదులున్నాయి. ఈ శిబిరంలో ఎస్‌డీపీఓ దేవేంద్ర, సీడీ వేణుధర్ సబర్, ప్రొహిబిషన్ ఐఏఎస్ అధికారి సంతోష్ మిశ్ర పాల్గొన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 40 ఫిర్యాదుల రాగా.. అందులో 36 వ్యక్తిగత, 4 సామాజిక ఫిర్యాదులున్నాయి.

గ్రీవెన్స్‌సెల్‌కు 63 వినతులు