
ఎలుగుబంటి హల్‌చల్
● భయంతో పరుగులు తీసిన జనం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. సోమవారం సాయంత్రం జనసంచారం ఉన్నప్పటికీ పట్టణంలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. పపడాహండి–ఉమ్మర్‌కోట్ రాష్ట్ర రహదారి 39 పై టురి వంతెన వద్ద కాసేపు సేద తీరింది. దానిని చూసి ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను వదిలేసి పరుగులు తీశారు. సమీప కర్రల డిపోలకి ప్రవేశించిన భల్లూకం కొంత సేపు అక్కడ సంచరించింది. తర్వాత నేరుగా పూజారి వీధి వద్దకు వెళ్లడంతో జనం భయంతో ఇళ్లకు తలుపులు వేసి మేడల మీదకి వెళ్లి పొయారు. పపడాహండి లోనికి ప్రవేశించడానికి ఆ ప్రాంతాల చుట్టూ కలియ తిరిగింది. చివరకు ప్రజల పెద్దగా కేకేలు వేయడం, రాళ్లు విసరడంతో అటవీ ప్రాంతం లోనికి వెళ్లిపోయింది.

ఎలుగుబంటి హల్‌చల్