
కొరాపుట్‌లో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పర్యటన
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంకువాల్ కొరాపుట్ రైల్వే లైన్‌లో శనివారం పర్యటించారు. కొరాపుట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశారు. అమృత్ భారత్ కింద నిర్మితమవుతున్న భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల టాయిలెట్లు, వెయిటింట్ హాల్, సిగ్నిల్ రూం తదితర ప్రాంతాలకు వెళ్లారు. సుక్కు వద్ద నిర్మితం అవుతున్న డబల్ లైన్ వంతెన పరిశీలించారు. డార్లి స్టేషన్ వద్ద ట్రాక్ పనితీరుపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. పాడువ వద్ద రైల్వే ట్రాక్ పక్క కొండల పైనుండి రాళ్లు పడినప్పుడు అడ్డుకొనే రక్షణ గోడల పట్టిష్టతపై ఆరా తీశారు. పలు చోట్ల డబ్లింగ్ లైన్ ట్రాక్ నిర్మాణ పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోరా, చీఫ్ అడ్మిస్ట్రేటివ్ (కనస్ట్రక్షన్స్) ఆఫీసర్ అంకుష్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

కొరాపుట్‌లో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పర్యటన

కొరాపుట్‌లో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పర్యటన

కొరాపుట్‌లో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పర్యటన