కలిమెల బంద్ ప్రశాంతం
మల్కనగిరి: జిల్లాలో కలిమెల సమితి బీడీఓ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ సర్పంచ్‌లు, సమితి సభ్యులు శుక్రవారం 12 గంటల బంద్ పాటించారు. సమితి బీడీఓ ప్రదీప్‌కుమార్ కర్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమితి పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బీడీఓ ప్రజా ప్రతినిధులైన జెడ్పీ సభ్యులు, సర్పంచులు, సమితి సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం సమితి కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు సుభాషిణి సొడి, బీజేడీ సీనియర్ నాయకుడు ప్రదీప్ మాఝి, మాజీ ఎమ్మెల్యే మానస్ మాడ్కామీ, సమితి మాజీ చైర్మన్ ద్వారక మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
కలిమెల బంద్ ప్రశాంతం


