దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ

Apr 10 2025 12:35 AM | Updated on Apr 10 2025 12:35 AM

దివ్య

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లాలోని డాబుగాం సమితి కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ వీల్‌చైర్లను బుధవారం పంపిణీ చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ప్రాథమిక విద్యామంత్రి నిత్యానంద గొండో 60 మంది దివ్యాంగులకు అందజేశారు. అలాగే వినికిడి యంత్రాలు, చార్జింగ్‌ మెషిన్లు, సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నబరంగ్‌పూర్‌ ఎంపీ బలభద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం

రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల ను పురస్కరించుకొని స్థానిక మార్వాడీ సమాజం అన్నదాన కార్యక్రమాన్ని మందిరం ప్రాంగణంలో బుధవారం నిర్వహించింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది అమ్మవారి చైత్రోత్సవాల్లో సుమారు 1,500 మందికి అన్న దానం చేశామని, ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.

జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

జయపురం: జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్‌యూజే కొరాపుట్‌ జిల్లా ప్రతినిధులు, కొరాపుట్‌ జిల్లా పాత్రికేయుల సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జయపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం మోహన్‌చరణ్‌ను ఉద్దేశించిన వినతిపత్రం బుధవారం అందజేశారు. ఇటీవల పూరీలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఎస్‌యూజే జిల్లా అధ్యక్షుడు తరుణ కుమార్‌ మహాపాత్రో, సహాయ కార్యదర్శి రాజేంద్ర సాహు, సలహాదారు నృసింహ చౌదరి, ఎస్‌.వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా ప్రాంగణంలో కలకలం

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌ ఆవరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌.టి.ఆర్‌ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (సీ్త్ర సదన్‌ మహిళా ప్రాంగణం)లో ఇద్దరు యువతులు అదృశ్యం కావడం కలకలంగా మారింది. బ్యూటీషియన్‌ శిక్షణ పొందుతున్న 21 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువతి మంగళం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లంచ్‌ బ్రేక్‌కు బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో సీ్త్రసదన్‌ ఇన్‌చార్జ్‌ సనపల సత్యవతి ఇన్‌చార్జ్‌ మహిళా ప్రాంగణం మేనేజర్‌ పి.విమల సూచన మేరకు ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు పోలీస్‌ కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 6309990816, 63099 90816 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ ఇద్దరు యువతులదీ విశాఖపట్నం కాగా, ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఇద్దరు అనాధులే. ఇందులో ఓ యువతికి దూరపు బంధువులు ఉన్నారు. విశాఖపట్నం సీ్త్రసదన్‌లో బ్యూటీషియన్‌ కోర్సు లేకపోవటంతో వీరు ఎచ్చెర్ల కేంద్రంలో చేరి ఈ నెల ఒకటో తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కాలం రెండు నెలలు. వీరిద్దరు స్నేహితులు. ఇద్దరి వద్దా ఫోన్లు లేదు. తోటి అభ్యర్థుల వద్ద ఫోన్‌ తీసుకుని హైదరాబాద్‌, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులతో తరచూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ ఫోన్‌ నంబర్లు ప్రస్తుతం స్విచ్‌ ఆఫ్‌ వస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ మేజర్లు కావటంతో ప్రేమ వ్యవహారమా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ఉంటే స్థానిక అధికారుల వద్ద అనుమతి తీసుకొని వెళ్లవచ్చు. అలాకాకుండా సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

బాలిక ఆత్మహత్య

కవిటి: మండలంలోని కె.కపాసుకుద్దికి చెందిన సిందిరి అపూర్వ(13) అనే బాలిక మంగళవా రం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపూ ర్వ కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెంది మంగళవారం సాయంత్రం 6 గంటల సమ యంలో ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఈ మరణంపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని మృతురాలి తల్లి హేమలత పోలీసులకు తెలియజేసినట్లు ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ మేరకు కవిటి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి బుధవారం ఉదయం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి అప్పగించారు.

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ 1
1/2

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ 2
2/2

దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement