తాగునీరు అందక తమ గ్రామంలో గొంతెండుతోందని కొరాపుట్ జిల్లా బందుగాం సమితి గిరిడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక కారు ముందు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు. తమ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో విపక్ష బీజేడీకి చెందిన సస్మితా మెలక సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – కొరాపుట్
● గొంతెండుతోంది..!