● మరొకరికి గాయాలు
రాయగడ: నీలావడి అగ్నిగంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బైక్‌పై వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి జిల్లాలోని స నొ చాందిలి గ్రామానికి చెందిన బి ప్రసన్న (43)గా గుర్తించారు. గాయాలపాలైన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బి.ప్రసాద్‌గా సమాచారం. మంగళవారం రాత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు సనొ చాంది లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మూడు బైకులపై నీలావడికి బయలు దేరారు. నీలావడికి సమీపంలోని ఉతకపాడు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ముందుగా రెండు బైకులు వెళ్లిపొగా వారి వెనుకే వెళుతున్న ప్రసాద్, ప్రసన్నల బైకు అదుపుతప్పి బ్రిడ్జి కింద పడిపొయింది. వెనుక వస్తున్న ప్రసాద్, ప్రసన్నలు ఇంకా రాలేదని అనుమానించి న తోటి స్నేహితులు తిరిగి వెనుకకువచ్చి చూడగా బ్రిడ్జి కింద పడి ఉన్న ఇద్దరిని చూసి వెంటనే ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే సంఘటనా స్థలం వద్దే ప్రసన్న ప్రాణాలు కోల్పొగా తీవ్రగాయాలకు గురైన ప్రసాద్‌ను అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం రిఫర్ చేశారు. మంగళవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సంద ర్శించారు. ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.