పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి పరిధి పెద్ద కొ త్తూరు పంచాయతీలో ఖరీఫ్‌లో పండించిన సుమా రు 3,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అన్నదాతలు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలని ఏడీఎం రాజేంద్రమింజ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ధాన్యం కొనుగోళ్లు చేయనందుకు మండీ, రెవెన్యూ కార్యాలయానికి పెద్దకోత్తూరుగ్రామ పంచాయతీ వాసులు ఇటీవల తాళాలు వేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కు టార్గెట్ లేదని సొసైటీ అధికారులు అంటున్నార ని పెద్దకొత్తూరు రైతులు పడ్డ జగన్నాథరావు అంటున్నారు. గుసాని రైతులకు తోలుత నుంచి మండీ అధికారులు ధాన్యం కోనుగోళ్లలో చిన్నచూపు చూస్తున్నారని, ఇప్పటికై నా మిగులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేకపోతే కోర్టుకు వెళతామ ని రైతు చెల్లి సోమేశ్వర్‌ర్రావు తెలిపారు.