
హిరమండలం: వంశధార గొట్టా బ్యారేజీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నట్లు వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు అన్నారు. గతంలో వచ్చిన వరదలకు బ్యారేజీ దిగువ భాగాన కోతకు గురైన గట్టు ప్రాంతంలో సుమారు రూ.27 లక్షలతో నిర్మించనున్న గోడ రాతికట్టుకు సంబంధించిన అలైన్‌మెంట్ పను లు, వంశధార రిజర్వాయర్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.గొట్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టి సుమా రు 50 ఏళ్లు పూర్తయిందన్నారు. ఐదారేళ్లుగా మెయింటెనె్‌స్ తగ్గిందని, గతంలో నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ వెళ్లిపోవడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రెడ్డిశాంతి, మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రభుత్వానికి విన్నవించడంతో నిధులు మంజూరయ్యాయని, పనులు త్వర లో ప్రారంభమవుతాయన్నారు. బ్యారేజీని పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డ్రిప్ కింద రూ.25 కోట్లు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
ఆగస్టు నాటికి ఎత్తిపోతల పథకం పూర్తి
గొట్ట బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మూడు ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం పనులకు మెదట విడతగా రూ.140కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ పనులు ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు. లిఫ్ట్ పనులు పూర్తయితే 10 నుంచి 12 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌కు మళ్లించి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వచ్చే వరదలకు ఇక్కడి నుంచి నీటిని తోడే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు డీఎస్‌ఈ ఎంవీ రమణ, ఈఈ ప్రదీప్ కుమార్, డీఈలు అనిల్ కుమార్, సతీష్, ఏఈలు సత్యనారాయణ, పరిషిద్ బాబు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.