భక్తుల సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యం పెనుగంచిప్రోలు: భక్తుల సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పెనుగంచిప్రోలు ఆలయ కమిటీ చైర్మన్ చుంచు రమేష్‌బాబు, ఈఓ జీవీడీఎనల్ లీలాకుమార్ అన్నారు. ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలి సాధారణ సమావేశం చైర్మన్ చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అంకమ్మ వారి ఉపాలయం గోపురం వెండి తాపడం తయారీకి అంచనాలు తయారు చేయడానికి, ఆలయం మూడేళ్ల ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ప్రస్తుత డీసీ క్యాడర్ నుంచి ఆర్‌జేసీ క్యాడర్‌కు ఆలయ పరిధి పెంపునకు, భక్తుల క్యూలో మినరల్ వాటర్ ఏర్పాటుకు అంచనాలు తయారుచేయడానికి తీర్మానాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ వేలానికి, అమ్మవారి యాగశాలలో ప్రస్తుతం ఉన్నదానికి గాలి వీయడానికి కిటికీల ఏర్పాటుకు, ఆలయ ప్రాంగణంలో, సత్రాల వద్ద లాన్, పూల మొక్కలు పెంచడానికి, దాతల ద్వారా వచ్చిన అన్న ప్రసాదాల విరాళాలు ఎంత ఉన్నవి, వడ్డీ ఎంత, వివరాలు తెలుసుకోవడానికి, దేవస్థాన దక్షిణ భాగంలో సిబ్బందికి టాయిలెట్స్, పార్కింగ్ ఏర్పాటుకు.. గోశాలలో అదనంగా ముగ్గురు కూలీలను నియమించుకునేందుకు కలెక్టర్ ఆమోదానికి తీర్మానాలు చేశామని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐవీఆర్‌ఎస్‌కు
ఫిర్యాదుల వెల్లువ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో తొలి రోజే భక్తులకు ఎదురైన ఇబ్బందులపై ఐఆర్‌వీఎస్‌కు భారీగా ఫిర్యాదులందాయి. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్యూలో ఫ్యాన్లు లేక ఎదురైన ఇబ్బందులు, తాగినీటి సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. మరో వైపున వాతావరణం వేడిగా ఉండటమే కాకుండా ఉక్కబోత కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కొండపైకి భక్తులు చేరుకునే క్యూలో కొంత మందికి మాత్రమే మంచినీటిని అందించడం, లోపల వైపు ఉన్న వారికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులందాయి. దీనిపై దేవదాయ శాఖ అధికారులు అప్రమతమయ్యారు. భక్తుల ఫిర్యాదులపై ఆలయ ఈవోను దేవదాయ శాఖ అధికారులు వివరణ కోరగా వెంటనే సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
జూనియర్ సాఫ్ట్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ జట్టుకు రజతం
విజయవాడ–తిరుపతి
మధ్య ప్రత్యేక రైలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన 21వ జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ షిప్‌లో ఏపీ మిక్స్‌డ్ జట్టు రజత పతకం కై వసం చేసుకుంది. జట్టు సభ్యులు రేవంత్, షేక్ గౌస్ మొహిద్దీన్, ఎస్.ఈశ్వర హితేష్, ఏఎస్ వైశాలి, డి.అరిఫా, ఆర్.హాసినిని ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డి.నవీన్ కుమార్, అధ్యక్షుడు వి.శ్రీనుబాబు, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్, కోశాధికారి బి.నీరజ, సంఘ సభ్యులు అభినందించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దసరాకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. విజయవాడ, తిరుపతి (07249) ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి 16 వరకు రోజు ఉదయం 9.30 గంటలకు విజయ వాడలో బయలుదేరి, అదేరోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07250) రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు పెద్దవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.