రేపటి నుంచి ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

చిలకలపూడి(మచిలీపట్నం): అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆపరేషన్‌ క్లీన్‌స్వీప్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఎక్కడా చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో శనివారం మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు వారా ల్లో వారానికి ఒక ఉద్దేశంతో ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ పేరుతో అన్ని పురపాలక సంఘాల్లో చేపట్టాలన్నారు. ప్రభు త్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణిధూర్జిటి, కమిషనర్లు బాపిరాజు, మనోహర్‌, కొండయ్య, సుభాష్‌చంద్రబోస్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement