నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

● వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు బాపూ మ్యూజియం నుంచి మొగల్రాజపురం గుహల వరకు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపూ మ్యూజియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆపై మేధోమధన చర్చలతో పాటు చిత్రలేఖనం,హెరిటేజ్‌ క్విజ్‌, ఫొటోగ్రఫీ తదితర పోటీలు ఉంటాయి. రోజంతా బాపూ మ్యూజియంలో ప్రత్యేక గైడెడ్‌ టూర్లు సందర్శకులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. లేజర్‌ షో, ఇందిరాగాంధీ మునిసిపల్‌ మైదానంలో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ టాలీవుడ్‌ గాయకుల సంగీత విభావరి నిర్వహించనున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 18న సోమవారం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు బాపూ మ్యూజియంలో ఏర్పాట్లు చేశారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేసేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. బాపూ మ్యూజియంలో ఏర్పాట్లను కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలించారు.

బాపూ మ్యూజియం వేదికగా కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement