న్యూస్‌రీల్
ముప్పై ఏళ్లుగా నరకం చూస్తున్నాం
తాగేందుకు నీళ్లు లేక యాతన పడుతున్న స్థానికులు కలుషిత నీటినే ఇంటి అవసరాలకు వాడుతున్న వైనం పక్కా గృహాలు, మౌలిక వసతులు లేక నలభై ఏళ్లుగా అవస్థలు ఓటర్లు గానే చూసి వదిలేస్తున్న ప్రజా ప్రతినిధులు కడింపోతవరం, గడ్డమణుగు లోయ క్యాంపుల్లో దుర్భరంగా కార్మికుల కుటుంబాలు
గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేరా?
బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం
పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని వివేకానందనగర్ వాసి మల్లెల శ్రీనివాసరావు గృహంలో మే పుష్పం విరబూసింది. చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానానికి బెంగళూరుకు చెందిన సిద్ధిరెడ్డి మునిరెడ్డి, జాహ్నవిరెడ్డి కుటుంబం శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.
కంచికచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలధార– జలహారతి పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం పరిశీలించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జరుగుతున్న నక్కలవాగు ఫీడర్ చానెల్ పనుల పురోగతిని సమీక్షించారు. రూ.2.53 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా భూగర్భజలాల పెంపు దలతో పాటు సాగునీటి అవసరాలకు గణనీయంగా ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. రోజుకు ఎంతమంది పనికి వస్తున్నారు, ఉదయం ఎప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రస్తుతం 80 మంది కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారని, ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 15 వరకు వేతనాలు జమయ్యాయని, రోజుకు రూ.300 నుంచి రూ.307 వరకు వేతనం అందుతోందని వారు తెలిపారు. పనుల ప్రదేశంలో ఉన్న ముళ్ల పొదలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్‌ఎంఎంఎస్ హాజరు విధానం గురించి డ్వామా పీడీ రాము కలెక్టర్‌కు వివరించారు. ఉదయం 5.30 గంటలకు తిరిగి ఉదయం 9.30కు రెండు విడతల్లో హాజరు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. పనుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో డ్వామా పథకం సంచాలకుడు ఎ.రాము, నందిగామ ఆర్డీఓ అనిల్‌కుమార్ డీఎల్‌పీఓ లక్ష్మీకుమారి, ఎంపీడీఓ డి.వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ వి.మానస, ఇరిగేషన్ ఏఈ రాజేష్, ఏపీఓరమాదేవి పాల్గొన్నారు.
పొట్టకూటి కోసం ఎల్లలు దాటి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. నలభై ఏళ్లుగా మన రాష్ట్రంలో నివసిస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వాలు వీరిని ఎన్నికలప్పుడు పనికొచ్చే ఓటర్లుగానే చూశాయి తప్ప... సాటి పౌరులుగా ఏనాడూ చూడలేదు. అందుకే చిత్రంగా వీరందరికీ ఓటరు కార్డులు అయితే ఉన్నాయి కాని రేషన్ కార్డులు మాత్రం కొందరికే ఉన్నాయి. వీరికి గుక్కెడు మంచినీరు దొరకడం కూడా గగనమే. క్యాంపుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక దుర్భర జీవితాల్ని గడుపుతున్నారు. ఏలికల కరుణా కటాక్షాలు వీరిపై ఇంకెప్పుడు ప్రసరిస్తాయో వేచిచూడాల్సిందే.
నేను పుట్టక ముందే మా కుటుంబం ఇక్కడ స్థిర పడింది. తాగేందుకు నీళ్లు లేక, ఉండేందుకు ఇల్లు లేక నరకయాతన పడుతున్నాం. వాడుకునే నీళ్లు కూడా పసు పు రంగులో వస్తున్నాయి. అధికారులు, నాయకు లు పట్టించుకుని మా సమస్యలను తీర్చాలి.
– మరియమ్మ, గాంధీ క్యాంపు
పుట్టిన గడ్డను వదిలి పనుల కోసం నలబై ఏళ్లుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటున్నారు కానీ మా సమస్యలను పట్టించుకోవట్లేదు. తాగడానికి నీళ్లు లేక రోజుకి మూడు డబ్బాలు రూ.60 పెట్టి కొంటున్నాం. వాడుకునే నీళ్లు కలుషితమై ఎలర్జీలు వస్తున్నాయి.
–లక్ష్మి, గాంధీ క్యాంపు
జి.కొండూరు: పొట్టకూటి కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చిన వీరు రెండు క్యాంపులుగా స్థిరపడ్డారు. జి.కొండూరు మండలం గడ్డమణుగు లోయ పరిధిలోని మాస్టర్ క్యాంపు, పినపాక శివారు కడింపోతవరం పరిధిలో గాంధీ క్యాంపులను ఏర్పాటు చేసుకుని గత నలబై ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం గాంధీ క్యాంపులో 35 కుటుంబాలు నివసిస్తుండగా 150 మంది జనాభా, మాస్టర్ క్యాంపులో 32 కుటుంబాలు నివసిస్తుండగా 154 మంది జనాభా ఉన్నారు. ఈ రెండు క్యాంపులలో 90మందికి ఓటు హక్కు సైతం ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేశారు. వీరికి ప్రభుత్వ పథకాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వీరంతా సమీపంలోనే క్వారీలు, క్రషర్లు, కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమ ల్లో రోజువారీ కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కా గృహాలు లేక పూరి పాకల్లోనే నివాసం ఉంటున్నారు. క్వారీల్లో బాంబుల మోత, బాంబులు పేలడం వలన ఎగిరిపడే రాళ్లు, విష పురుగులతో నిత్యం సావాసం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.
తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక...
ఈ రెండు క్యాంపులలో నలబై ఏళ్లుగా నివాసం ఉంటున్న ఒడిశా కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కనీసం తాగేందుకు అవసరమైన నీటిని సరఫరా చేయ కుండా వదిలేయడంతో మినరల్ వాటర్ ఇరవై లీటర్ల డబ్బా రూ.20 పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం... వదిలేయడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇంటి అవసరాలకు వాడుకునేందుకు గాంధీ క్యాంపులో చేతి పంపును మాత్రం ఏర్పాటు చేశారు. మాస్టర్ క్యాంపులో బోరుబావిని ఏర్పాటు చేసి మోటరు ద్వారా మినీ ట్యాంకర్ సరఫరా చేస్తున్నారు. అయితే గతంలో ఈ ప్రదేశంలో ఉన్న కెమికల్ కంపెనీ వలన ఈ రెండు బోర్లలో నీరు కూడా కలుషితమై పసుపు రంగులోకి మారింది. ఈ కలుషిత నీటినే స్థానికులు వినియోగించాల్సి వస్తోంది. నెలల పసికందుల నుంచి వృద్ధుల వరకు ఈ నీటినే స్నానాలకు, వ్యక్తిగత, ఇంటి అవసరాలకు వినియోగించడం వలన ఎలర్జీల బారిన పడుతున్నారు. రాజధాని అమరా వతికి కూతవేటు దూరంలోనే ఉన్న ఒడిశా వలస కార్మికుల గోడు పాలకుల చెవికి సోకడం లేదు.
కడింపోతవరం గాంధీ క్యాంపులో తాగునీరు కోసం బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు
నలబై ఏళ్లుగా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. నీటి సౌకర్యం లేక నరకయాతన పడుతున్నాం. పక్కా ఇళ్లు లేక పూరి గుడిసెల్లోనే ఉంటున్నాం. గట్టిగా గాలొస్తే ఇళ్లు కూలిపోతున్నాయి. ఓట్లు అప్పుడు కనపడే నాయకులు తర్వాత కన బడడం లేదు. మా జీవితాలకు వెలుగు వచ్చేలా లేదు.
– కృపామణి, గాంధీ క్యాంపు
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.3790 టీఎంసీలు.


