గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని భూ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు బారులు తీరారు. స్వామివారు సర్వ పుష్పాలంకరణతో దర్శనమిచ్చారు. భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆర్థిక సాయంతో అన్నసమారాధన జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన
May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM
వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన
ఆటోనగర్(విజయవాడతూర్పు): సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం ఆటోనగర్ ఎంఎస్‌ఎంఈ హాలులో శనివారం నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. జనరల్ మేనేజరు ఏడీ శ్రీనివాస్, జీవీఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధికి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ రుణ ఉత్పత్తులు, ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న సౌకర్యాలను పారిశ్రామిక వేత్తలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. వ్యాపారవేత్తలకు ఒనకూరే ప్రయోజనాలను వివరించారు. బ్యాంకు ఎప్పుడూ ఎంఎస్‌ఎంఈ రంగానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంధనేతర ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వినియోగించాలి హనుమాన్‌జంక్షన్ రూరల్: వారంలో కనీసం ఒక్కరోజైనా ఇంధనేతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు సూచనలతో చలసాని 20 కిలోమీటర్లు మేర సైకిల్‌పై ప్రయాణిస్తూ రోజువారీ కార్యక్రమాలకు హాజరయ్యారు. హనుమాన్‌జంక్షన్‌లోని ఆయన నివాసం నుంచి శనివారం ఉదయం సైకిల్‌పై ఉమామహేశ్వరపురం వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లారు. అక్కడి పాల కేంద్రంలో రైతులతో సమావేశమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సైకిల్‌పై వీరవల్లి పాల కేంద్రానికి చేరకుని, పాడి రైతులతో సమావేశమయ్యారు. ఇంధన పొదుపుపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహారించాలని చెప్పారు. అనంతరం ఇటీవల విడుదలైన పదోవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన వీరవల్లి జడ్పీ హైస్కూల్‌లోని ఏడుగురు విద్యార్థులకు రూ.5 వేలు చొప్పున ప్రొత్సాహక బహుమతులు అందజేశారు.
వెంకటేశ్వరుని సన్నిధిలో భక్తుల రద్దీ
Advertisement


