పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన కానూ రులో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో మిస్టర్ రాష్ట్ర స్థాయి క్లాసిక్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలకు విజయవాడ సింగ్‌నగర్ మనోహర్ జిమ్‌లో క్రీడాకారులకు ఎంపిక చేశామన్నారు. 55–60 కిలోల విభాగంలో జి.వాసుదేవ్, 60–65 కిలోల విభాగంలో టి. రవితేజ, బి.దయాకర్, పి.రామకృష్ణ, ఎం. అవినాష్, జి.నీరజ్, 65–70 కిలోల విభాగంలో పి.శ్రీధర్, పి.సాయికుమార్, బి.అశోక్, 70–75 కిలోల విభాగంలో ఆర్.దుర్గా ఆంజనేయులు, జి.అనురాగ్‌ముఖేష్, కె.శ్రీరామ్, కె.హరికృష్ణ, 80–85 కిలోల విభాగంలో ఎస్‌కె.ఇబ్రహీం, 85 కిలోలపై విభాగంలో ఎస్‌కే రెహన్, సీహెచ్. గోపీకృష్ణ, ఫిజిక్ స్పోర్ట్స్ విభాగంలో వై.ప్రణయ్‌తేజ్, టి.రవితేజ, ఎం.అవినాష్, పి.సాయి కుమార్, వి.సురేష్, జి.అనురాగ్, ముఖేష్ ఎంపికయ్యారని వివరించారు. టీమ్ మేనేజర్‌గా అల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, కోచ్‌గా ఎస్‌కే ఖాదర్, ఇన్‌చార్జ్‌గా బాషా వ్యవహరిస్తారని తెలిపారు.
ప్రగతి సూచికల్లో
ఏ– ప్లస్‌ను నిలబెట్టుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్– 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల్లో ఏ ప్లస్ స్థాయిని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ – కేపీఐల లక్ష్యాలను ఆయన మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి స్కోరు 90గా ఉందని.. దీనిని మరింత మెరుగుపరిచి ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నారు. కంచికచర్ల, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం తదితర ఏ గ్రేడు మండలాలు ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు. గణాంక అధికారి డి.వి.ఎస్. ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు
పెనమలూరు: బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టామని శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ బి.సుజాతరాణి తెలిపారు. పెనమలూరులో మంగళవారం ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్(ఈసీడీ) కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మూడేళ్ల లోపు చిన్నారుల అభివృద్ధి అవరోధాలు నివారించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఈసీడీ పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. తల్లితండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలలో జరిగే స్క్రీనింగ్ చిన్నారులకు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌లు శ్రీలత, రెహనాబేగం, బేబీ, సచివాలయ కార్యదర్శులు మౌనిక, ఎస్.విజయలక్ష్మి, అంగన్‌వాడీ కర్యకర్తలు పాల్గొన్నారు.
నవచేతన అమలు పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక భ్రమరాంబపురంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న నవచేతన కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల అభివృద్ధి స్థాయిని అంచనా వేయొచ్చ సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను నమోదు చేస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు.


