పోర్టుకు విద్యుత్‌ సరఫరాపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు విద్యుత్‌ సరఫరాపై సమీక్ష

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

పోర్టుకు విద్యుత్‌ సరఫరాపై సమీక్ష

పెడన: మండల పరిధిలోని కూడూరు గ్రామంలో 133/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు విద్యుత్‌ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మారిటైమ్‌ బోర్డు అధికారులు పెడన తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రాంతాలను ఎంపిక చేసి స్థల సేకరణపై ఇన్‌ చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్‌తో సమీక్షించారు. నడుపూరు, కూడూరు, నందిగామ, కొంకేపూడి, పెడన, శింగరాయపాలెం గ్రామాలు మీదుగా మొత్తం 32 టవర్లను నిర్మించడానికి స్థల సేకరణ, సంబంధిత రైతుల భూములకు పరిహారం చెల్లింపు, రెవెన్యూ, పోరంబోకు, గ్రామ కంఠాలు తదితర వివరాలను చర్చించారు. ఈ సమావేశంలో మారిటైమ్‌ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, ఇన్‌చార్జి ఆర్‌ఐ విజయలక్ష్మి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement