బహిరంగ క్షమాపణ చెప్పాలి.. | - | Sakshi
Sakshi News home page

బహిరంగ క్షమాపణ చెప్పాలి..

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

బహిరంగ క్షమాపణ చెప్పాలి..

మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధా కృష్ణ రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. ‘వైఎస్సార్‌ సీపీ నేతల భార్యలను దుర్భాషలాడితే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ ఏమయ్యారు? స్కీమ్‌లు స్కామ్‌లతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్‌ మావిగన్‌ పేరుతో మంచి ప్రతిపాదన చేసేసరికి చంద్రబాబు ముఠాలో వణుకు మొదలైంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలన గురించి మాట్లాడే సామర్థ్యం లేక అమరావతి అవినీతి నుంచి డైవర్ట్‌ చేయడానికి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు’ అని అనినాష్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement