కోడికి | - | Sakshi
Sakshi News home page

కోడికి

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

సాగర్‌ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 530.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 11,809 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 పౌల్ట్రీపై వివక్ష దుర్గమ్మకు కానుకగా బంగారు మంగళసూత్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు మంగళవారం రూ. 2.70 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన టి.శ్రీనివాసరావు కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. 2.70 లక్షలు వెచ్చించి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలు, రెండు పూసలను ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి డీవీవీ సత్యనారాయణ, అర్చకులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. స్వర్ణాంధ్ర విజన్‌ అమలుపై కేంద్ర బృందం సమీక్ష ‘పది’ మూల్యాంకనం పరిశీలన బ్రాయిలర్‌పై తీవ్ర ప్రభావం

న్యూస్‌రీల్‌

నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం

పరిహారం అందజేయాలి

ఆరోగ్య దినోత్సవం ర్యాలీ

డిగ్రీ పరీక్ష కేంద్రాల తనిఖీ

ఎన్టీఆర్‌ జిల్లాలో కోళ్ల పారాల వివరాలు నాడు, నేడు

విజయవాడ సిటీ
సాగర్‌ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 530.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 11,809 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
పౌల్ట్రీపై వివక్ష

గతేడాది జిల్లాలో బర్డ్‌ఫ్ల్లూతో 18వేలకు

పైగా బ్రాయిలర్‌ కోళ్లు మృత్యువాత

కల్లింగ్‌ చేసిన కోళ్లకే పరిహారం

అందించి చేతులు

దులుపుకొన్న ప్రభుత్వం

ప్రభుత్వ భరోసా లేక జిల్లాలో ఏడాదికే

తగ్గిన 3.35లక్షల కోళ్ల పెంపకం

రూ.3.64 లక్షల పరిహారంతో సరి

తహసీల్దార్‌ కార్యాలయాన్ని

ముట్టడించిన మొక్కజొన్న రైతులు

మద్దతు ధర రూ.2,400 చెల్లించాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

వెంటనే ప్రారంభించాలి

రైతు సంఘం నేతలు

మచిలీపట్నంఅర్బన్‌: స్వర్ణాంధ్ర విజన్‌ అమలును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. నగరంలోని కలెక్టరేట్‌ ‘మీకోసం’ సమావేశ మందిరంలో కేంద్ర బృంద సభ్యులు వికాస్‌ కిచి (విద్యుత్‌), సంతోష్‌ ప్రసాద్‌ (పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహం) కలెక్టర్‌ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో కీలక పనితీరు సూచికలు (కేపీఐ) మానిటరింగ్‌, స్వర్ణాంధ్ర విజన్‌ అమలు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లా విజన్‌ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతో పాటు కేపీఐల నెలవారీ నమోదు విధానాలను వారు పరిశీలించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాన్ని మంగళవారం రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) నాగమణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూల్యాంకన ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జి.కొండూరు: ప్రభుత్వం తీరుతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కార్‌ వచ్చినప్పటి నుంచి ‘కోడి’కి భరోసా కానరావడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్‌ప్లూ వచ్చి ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది వ్యాపించకుండా చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా కోళ్లు మృత్యువాత పడిన కోళ్లఫారాల్లో బతికి ఉన్న కోళ్లతో పాటు గ్రామాల్లో బతికి ఉన్న నాటుకోళ్లను సైతం కల్లింగ్‌ చేశారు. జిల్లాలో గంపలగూడెంలోని అనుముల్లంక గ్రామంలో అత్తునూరి పద్మారెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో 15వేల కోళ్ల వరకు మృత్యువాత పడ్డాయి. ఎ.కొండూరు మండల పరిధి దీప్లానగర్‌ హనుమాన్‌ ఫౌల్ట్రీ కోళ్ల ఫారంలో 3వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. పద్మారెడ్డి కోళ్ల ఫారంలో మిగిలి ఉన్న కోళ్లతో పాటు, అదే గ్రామంలో 70మంది రైతులు ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్లతో కలిపి 7500ను అధికారులు కల్లింగ్‌ చేశారు. వీటి వరకు నష్ట పరిహారంగా రూ.3,20,000 అందజేశారు. దీప్లానగర్‌ హనుమాన్‌ పౌల్ట్రీఫారంలో బతికి ఉన్న కోళ్లతో పాటు అదే గ్రామంలో 12మంది రైతులకు చెందిన మొత్తం 300కోళ్లను అధికారులు కల్లింగ్‌ చేశారు. నష్ట పరిహారంగా రూ.44వేలను అందజేశారు. కల్లింగ్‌ చేసిన ఒక్కొక్క కోడికి రూ.135చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా దీనిలో కోత విధించి నిర్వహకులకు వెన్నుపోటు పొడి చారు. పరిహారం విషయంలో ప్రభుత్వ తీరుతో రూ.50 లక్షల వరకు బాధిత కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టపోయారు.

బర్డ్‌ఫ్లూతో ఎన్టీఆర్‌ జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్‌ వ్యాప్తితో అధికారికంగా రెండు కోళ్ల ఫారాల్లో మాత్రమే కోళ్లు మృత్యువాత పడినా మిగిలిన ఫారాల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడినట్లు తెలిసింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో కోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. వైరస్‌ వచ్చి పోయిన ఏడాది కాలంలోనే 29 బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల నిర్వహణ నిలిచిపోయి 3,34,500 కోళ్ల పెంపకం తగ్గింది. మూడు నాటుకోళ్ల ఫారాలు తగ్గిపోయి 1100 వరకు కోళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇటీవల మార్చిలో మళ్లీ బర్డ్‌ ప్లూ వ్యాప్తి చెందుతుందని పుకార్లు వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పెట్టుబడి పెరిగిపోయి ఉత్పత్తి తగ్గడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కోళ్లు పెంచేందుకు నిర్వాహకులు పూర్తిగా వెనకడుగు వేశారు.

గంపలగూడెంలో కోళ్ల పెంపకం

నిలిపివేసిన కోళ్ల ఫారం

మద్దతు ధర ఇవ్వండి

ఎ.కొండూరు: అధికారులకు మొక్కజొన్న రైతు సెగ తగిలింది. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చూడాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎ.కొండూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. రైతు సంఘం నేత ఆళ్ల అమ్మిరెడ్డి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రైతు సంఘం నేత అమ్మిరెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 8వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమన్నారు.

అతి తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది

రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకే అమ్ము కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు బోనస్‌ ప్రకటించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పానెం ఆనందరావు, రావుల రామకృష్ణ, సోమా యోహాను, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

7

జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది వచ్చిన బర్డ్‌ ప్లూ వైరస్‌తో కొన్ని ఫారాలలో కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. వైరస్‌లు దరి చేరకుండా ఉండేలా బయో సెక్యూరిటీ పద్ధతులను రైతులకు వివరిస్తున్నాం. ఎన్విరాన్‌మెంటల్లీ కంట్రోల్డ్‌ బ్రాయిలర్‌ ఫారాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం.

–ఎం.హనుమంతురావు, ఎన్టీఆర్‌ జిల్లా పశువైద్య శాఖ అధికారి

కోళ్ల ఫారంలో బర్డ్‌ ఫ్ల్లూతో చనిపోయిన కోళ్లతో పాటు అధికారులు చంపిన వాటితో కలిపి మొత్తం 15 వేలు చనిపోయాయి. ఒక్కొక్క కోడికి రూ.130 చొప్పున ఇస్తామని ప్రకటించి 6500 కోళ్లకు.. ఒక్కొక్క కోడికి రూ.35 చొప్పున రూ.2.28 లక్షలు ఇచ్చారు. రూ.35 లక్షల వరకు నష్టపోయాను. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారమైన ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి.

అత్తునూరి పద్మారెడ్డి, ఫారం యజమాని, అనుముల్లంక

మచిలీపట్నంఅర్బన్‌: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరులో ర్యాలీ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ప్రేమ్‌చంద్‌ పాల్గొన్నారు.

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మంగళవారం బందరులో డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

2025 2026లో

(బర్డ్‌ ఫ్లై సమయంలో)

మొత్తం కోళ్ల ఫారాలు 116 84

బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు 83 54

లేయర్‌ ఫారాలు 25 25

బ్రాయిలర్‌ ఫారాల్లో కోళ్లు 9,30,000 5,95,500

నాటుకోళ్ల ఫారాలు 8 5

నాటు కోళ్ల ఫారాల్లో కోళ్లు 1800 710

సంవత్సరానికి ఉత్పత్తి

అవుతున్న మాంసం 5,592టన్నులు 3,580టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement