అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

గుడివాడ రూరల్‌: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేశారని చెప్పారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పంట పాడై.. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఉన్న కొద్దిపాటి పంటకు సైతం సరైన ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరా రు. లేదంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement