నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
డీపీఎం శంకర్ నాయక్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులకు తక్కువ పెట్టుబడితో నిరంతరాయంగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శంకర్‌నాయక్ అన్నారు. మంగళవారం విజయవాడలోని ఏపీఏఓస్ అసోసియేషన్ హాలులో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో సుస్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని అన్నారు. ఎంపిక చేసిన ట్రైనింగ్ –ఐసీఆర్‌పీలకు ప్రకృతి వ్యవసాయంలో జరిగే 9 సార్వత్రిక సూత్రాలపై అవగాహన, ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయం గురించి, పంటల వారీగా వివరాలు తెలియజేశారు. రైతులతో చేయించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎస్పీ వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ గౌతమ్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌నందు సమరసత సేవా ఫౌండేషన్ వారి పూజ్య ధర్మాచార్య సదస్సును మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం


