చంద్రబాబు పాలన అంటేనే రైతులకు గడ్డు కాలం అని మరోసారి రు
పీజీఆర్‌ఎస్‌లో రైతుల వినతులు పంట చేతికొచ్చి మూడు నెలలు గింజ కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైన గిట్టుబాటు ధర నష్టానికి తెగనమ్ముకుంటున్న రైతులు
నష్టానికి తెగనమ్ముకున్నా!
జగన్నాథపురం గ్రామంలో 30 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కంకులు విరిచి రెండున్నర నెలలయింది. కల్లాల్లోనే ఉంచాను. ఇప్పటివరకు మొక్కజొన్న కొంటాం అని ఎవరూ రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. చేసే పరిస్థితి కనబడడం లేదు. ప్రస్తుతం రూ.1850కు అడుగుతున్నారు. మద్దతు ధరకు బయట ధరకు రూ.550 తేడా ఉంది. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్ట పోతాం
– పి.మురళీకృష్ణ, గొట్టుముక్కల
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మా పంట కొనుగోలు చేయండి.. మహా ప్రభో అంటూ మొక్కజొన్న రైతులు వేడుకుంటున్నారు. పంట కొనుగోలు చేయాలని వినతిపత్రాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌లో సైతం అర్జీలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి ప్రభుత్వం దిగజార్చింది. ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధర ప్రకటనలకే పరిమితమైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులు పండించిన మొక్కజొన్న పంట ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. రైతుల వద్ద మొక్కజొన్న కొనుగోలు చేయాలని సెంటిని, క్రక్స్ వంటి సంస్థలతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. రెండు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెగనమ్ముకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మెట్ట ప్రాంత రైతులు వాణిజ్య పంటలు గిట్టుబాటు కాక మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఏటేటా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో మొత్తం 4559 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట దిగుబడి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటా లుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. మొక్క జొన్న కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. రైతులు మొక్కజొన్న కండెలు విరిచి కల్లాల్లో ఉంచారు. కొందరు మిల్లు పట్టించి గింజలు నిల్వ చేశారు. రెండు మూడు నెలల క్రితమే పంట చేతికి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. వీటికి తోడు మొక్కజొన్న కంకులు కోసేందుకు ఎకరాకు రూ.2500 నుంచి రూ.3వేలు ఖర్చవుతుంది. మిల్లు ఆడించేందుకు మరో రూ.3వేలు ఖర్చవుతుంది. ఇక కౌలు రైతులైతే అదనంగా ఎకరాకు రూ.14వేల నుంచి రూ.18వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తోంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీతో పాటు కౌలు చెల్లించాల్సి రావడంతో దళారులు అడిగిన రేటుకు కొందరు తెగనమ్ముకుంటున్నారు. నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉన్న రైతులు నిల్వ చేసి మూడు నెలలుగా గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారు. అసలు కొనుగోళ్లే జరగకపోవడంతో పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
క్వింటాకు రూ.600 వరకు నష్టపోతున్న రైతు
ప్రభుత్వం రూ.2400 మద్దతు ధర ప్రకటించింది కాని కొనుగోలు చేయడం లేదు. అధికారులు రైతుల వద్ద మొక్కజొన్న కొనుగోలు చేయాలని జిల్లాలోని సెంటినీ, క్రక్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించినా.. ఆ తర్వాత వారు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో క్వింటా రూ.2500 వరకు కొనుగోలు చేశారు. అప్పటితో పోల్చుకుంటే ధర మరికొంత పెరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు క్వింటా రూ.1800కే అడుగుతున్నారు. దీంతో ఒక్కో రైతు క్వింటాకు రూ.600 వరకు నష్టపోవాల్సి వస్తోంది. వినతి పత్రాలు సమర్పించినా మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడమే తప్ప మరో మార్గం లేదని, ఆ ధరకు విక్రయిస్తే పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ఊరిలో కౌలుకు తీసుకొని 35 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. కౌలు ఎకరాకు రూ.18 వేలు. పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.30వేల వరకు అయ్యాయి. పెట్టుబడులకు తెచ్చిన డబ్బు, కౌలు చెల్లించాల్సి రావడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటా రూ.1850లకు విక్రయించా. ఒక్కో క్వింటాకు రూ.500 నుంచి రూ.600 వరకు నష్టపోయాను. ఈ ఏడాది ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమే.
– ఈదా నరసింహారెడ్డి, జగన్నాథపురం
చంద్రబాబు పాలన అంటేనే రైతులకు గడ్డు కాలం అని మరోసారి రు
చంద్రబాబు పాలన అంటేనే రైతులకు గడ్డు కాలం అని మరోసారి రు


