బెయిల్ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా
డీఆర్వో చంద్రశేఖరరావు
మచిలీపట్నంటౌన్:జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని చెప్పారు. జిల్లాలో సాధారణ ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వృక్ష ,జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల పరీక్షలకు సంబంధించి మొత్తం 27,161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 1,868 మంది పరీక్షలకు కానున్నారన్నారు. ఇంటర్మీడియెట్ థియరీ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి నెల 23వ తేదీ నుంచి మార్చి నెల 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. ఈ థియరీ పరీక్షలు జిల్లాలోని 63 కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు మొదటి రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 49,579 మంది హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కంట్రోల్ విభాగాన్ని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీవీ నాయుడు, పరీక్షల కన్వీనర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సరళకుమారి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


