ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శనలో విజేతలు
● రెండు పళ్ల విభాగంలో.. దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్‌లకు చెందిన ఎడ్ల జత 4095.4 మీటర్లు లాగి ప్రథమస్థానంలో నిలిచింది. ఆర్‌కే బుల్స్ అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణచౌదరి (వేటపాలెం)ల ఎడ్ల జత ద్వితీయస్థానంలో, చాగంటి శ్రీనివాస్‌చౌదరి(కొండెపాడు), పల్లం రిత్విక్‌చౌదరి, యువాన్ చౌదరి(ఉప్పుగుండూరు)ల ఉమ్మడి ఎడ్ల జత తృతీయస్థానంలో నిలిచాయి.
● నాలుగు పళ్ల విభాగంలో... కొప్పుల గోవర్థన్‌రెడ్డి, ప్రవలీష్‌రెడ్డి(సూర్యాపేట)ల ఎడ్ల జత 3966.4 మీటర్ల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. చిలుకూరి నాగేశ్వరరావు(జెపంగులూరు), శశంక్‌శ్రేయా (కోడుమూరు)ల ఎడ్ల జత ద్వితీయస్థానంలో, బచ్చిగారి విజయలక్ష్మినాయుడు(ఆకవీడు), కెవీ హేమలతారెడ్డి (కడప)ల ఎడ్ల జత తృతీయస్థానంలో నిలిచాయి.
ఉత్సాహంగా పోటీలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్‌లో జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ ఎడ్లజతలను తీసుకువచ్చి పోటీలలో పాల్గొంటున్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పోటీలలో రెండు పళ్ల, నాలుగు పళ్ల విభాగాల్లో విజేతలైన ఎడ్లజతల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. వారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన మంత్రి కొలుసు పార్థసారఽథి, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, శ్రావణ్‌కుమార్‌లు నగదు, జ్ఞాపికలను అందజేశారు.