ఘనంగా దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు అందరూ సమాజంలో మంచి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు సూచించారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నీరీ కాలనీలో ఓ ఫంక్షన్ హాలులో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడుకొండలరావు కోర్సు పూర్తి చేసిన 25 మంది దంత వైద్య విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలో సౌర విద్యుత్ వినియోగం యాభై శాతానికే పరిమితమైందని, ఇంకా పెరగాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు పేర్కొన్నారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సింటిలా–2025 పేరుతో సిద్ధార్థ ఆడిటోరియంలో భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులకు పోటీలు బుధవారం జరిగాయి. విజయభాస్కరరావు అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. బొగ్గు ఆధా రిత విద్యుత్, జలవిద్యుత్‌లతో పోలిస్తే సోలార్ ఎనర్జీ పర్యావరణహితమని తెలిపారు. ఎయిర్ కండీషనర్లు, గ్రీజర్లు వంటి విద్యుత్ పరికరాలు, సెల్ ఫోన్ల వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్టు ఇంజినీర్ జి.సుమంత్, అసిస్టెంట్ ఇంజినీర్ చైతన్య మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయిలో ఎనర్జీ కన్జర్వే షన్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభ అనంతరం విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మనోరంజని, ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ టి. శ్రీనివాసకృష్ణ, డెప్యూటీ హెడ్ తస్నీమ్, అధ్యాపకులు జె.పాండురంగారావు, ఎస్.విజయకృష్ణ, ఎన్.రాజశేఖర్, ముష్వరీన్, టి.పూజిత పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తూ తాపీ కార్మికుడి మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి పడి తాపి కార్మికుడి మృతిచెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన కొండపోగు ఉదయ్‌కుమార్(37) తాపీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. దేవినగర్‌లో చేపట్టిన భవన నిర్మాణ పనులకు వారం రోజుల నుంచి వెళ్తున్నాడు. మంగళవారం ఆ భవనం మూడో అంతస్తులో పనులు చేస్తూ ప్రమాదవు శాతు అక్కడి నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌కుమార్‌ను తోటి కార్మికులు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే
ఘనంగా దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే


