ఎలా రద్దు చేస్తారు..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి పనులు కేటాయింపులు జరిపి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తరువాత ఎలా రద్దు చేస్తారు? నిధుల రాబడి అంచనాలు రూపొందించిన తరువాతే పనుల కేటాయింపు జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన హామీని సీఈవో లెక్క చేయటం లేదు. చైర్‌పర్సన్, పాలకవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
– వేముల సురేష్‌బాబు,
గూడూరు జెడ్పీటీసీ


