దుర్గగుడికి కంప్యూటర్ సామగ్రి వితరణ
మచిలీపట్నంఅర్బన్: విద్యా ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమ పరిశీలనలో భాగంగా తవిసిపూడి జెడ్పీ హైస్కూల్‌ను డీఈఓ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంపొందించడం, ప్రాథమిక భావనలపై పట్టు పెర గడం, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా లక్ష్య నిర్ధారణతో బోధన జరగాలన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, హాజరు శాతం, బోధన నాణ్యత మెరుగుపడేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యాస ఫలితాలను సమీక్షించారు. నోట్స్ సరిదిద్దు విధానం సహా ఇతర అకడమిక్ రికార్డులను పరిశీలించారు.
గన్నవరం: సమాజానికి డ్రగ్స్ మహమ్మారి పెను సవాల్‌గా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు, సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో బుధవారం వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులతో ముఖా ముఖీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని తెలిపారు. తన కుమారై దీపా వెంకట్ నేతృత్వంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ఉపాధి, వైద్య సేవలందించడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు. ట్రస్ట్ సీఈఓ శరత్‌బాబు, కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి పాల్గొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి అత్యాధునిక పరికరాలు అవసరమని.. ఇందుకు సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి రూ.2.80కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు. కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ వంటి విభాగాలకు వైద్య పరికరాలు అవసరమన్నారు. ఇందుకోసం రూ.2.80 కోట్లతో రూపొందించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.
దుర్గగుడికి కంప్యూటర్ సామగ్రి వితరణ


