పీపీపీపై జనకోటి కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

పీపీపీపై జనకోటి కన్నెర్ర

Dec 18 2025 11:12 AM | Updated on Dec 18 2025 11:12 AM

పీపీప

పీపీపీపై జనకోటి కన్నెర్ర

u8లో గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పీపీపీపై జనకోటి కన్నెర్ర సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు

న్యూస్‌రీల్‌

దుర్మార్గపు చర్య..

ప్రభుత్వం కళ్లు తెరవాలి..

చాలా బాధాకరం..

అట్టడుగు వర్గాలకు అన్యాయం..

ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది..

ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

గుడివాడలో అక్కినేని నాగార్జున

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
u8లో
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో

కోటి సంతకాల సేకరణ

ఆ ప్రతులను నేడు గవర్నర్‌కు

అందించనున్న వైఎస్‌ జగన్‌

ఉమ్మడి జిల్లా నుంచి

8.25 లక్షల సంతకాలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మెడికల్‌ విద్యను పేదలకు దూరం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించి ఆ ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి అందించనున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ఉద్యమానికి కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే కాకుండా మిగిలిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్‌ బెంబేలెత్తుతోంది.

ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి భారీ స్పందన లభించింది. రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సంతకాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ (పశ్చిమ), విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్‌), నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి 4.25 లక్షల సంతకాలు రాగా, కృష్ణాజిల్లా నుంచి మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల నుంచి సుమారుగా నాలుగు లక్షల ప్రజల నుంచి సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించాయి. ఆయా సంతకాల పత్రాలను 15వ తేదీన రెండు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే.

ఉద్యమిస్తున్న రాజకీయ, విద్యార్థి సంఘాలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 17 మెడికల్‌ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఐదు మెడికల్‌ కళాశాలలను పూర్తి చేసి తరగతులను సైతం ప్రారంభించారు. మరో రెండు కళాశాలలు అందుబాటులో వచ్చే సమయానికి ఎన్నికలు రావటంతో చంద్రబాబు సర్కార్‌ గద్దనెక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ తన అనుకూల వర్గీయులకు మెడికల్‌ కళాశాలలను కట్టబెట్టేందుకు కుట్రకు తెరలేపారు. దీనిపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉండగా అదేబాటలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

7

గత ప్రభుత్వంలో మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపట్టారు. అవి పూర్తయితే నాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యలో మంచి అవకాశాలు వచ్చేవి. కాని ప్రభుత్వం మారినంత మాత్రానా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గ చర్యగా భావిస్తున్నా. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణను ఆపాలి.

– కుక్కమళ్ల బ్యూలా,

బీటెక్‌ విద్యార్థి, కంచికచర్ల

ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య

విద్య అందుబాటులో లేకుండా పోతుంది. వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. గవర్నర్‌ సైతం ప్రైవేటీకరణపై తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం.

– జి.హేమంత్‌, బీటెక్‌ విద్యార్థి, మైలవరం

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్యను దూరం చేసినట్లే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.

– వెనుగుర్తి హరి, జగ్గయ్యపేట

ప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు బుధవారం వెటర్నరీ కాలనీలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఘనంగా జరిగాయి.

గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ బుధవారం గుడ్లవల్లేరు పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేశారు. మందుల పంపిణీ, వార్డులను పరిశీలించారు.

గుడివాడటౌన్‌: గుడివాడలో బుధవారం సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఏఎన్‌ఆర్‌ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.

సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేయటమే చంద్రబాబు సర్కార్‌ లక్ష్యంగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– సీహెచ్‌ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ల ముందు కాజేస్తూ, కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పీడీఎస్‌వో ఖండిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ిపీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. యువగళం పాదయాత్రలో జీవో నంబర్‌ 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నిస్తున్నాం.

– ఏ సురేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌వో

పీపీపీపై జనకోటి కన్నెర్ర 1
1/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 2
2/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 3
3/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 4
4/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 5
5/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 6
6/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

పీపీపీపై జనకోటి కన్నెర్ర 7
7/7

పీపీపీపై జనకోటి కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement